ప్రస్తుత సమాజములో మత్తుమందుల ఉపయోగం బాగా పెరిగిపోతుంది మరియు దానిని మానడం చాలా కష్టం. ఇందులో ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా వంటివి సాదరణముగా అందరికీ అందుబాటులో ఉన్నవి.
ఇవికాకుండా గంజాయి, నిద్రమాత్రలు, ట్రమడాల్ వంటి నొప్పుల మాత్రలు, కొన్ని రకముల దగ్గుమందులు కూడా తరచుగా చూస్తున్నాము.
ఇవే కాకుండా ఫోన్ కి అడిక్ట్ అవ్వడం, గ్యాంబ్లింగ్ వంటి బిహేవియర్ అడిక్షన్ కూడా చాలా ప్రమాదకరమైనవి.
ఒకసారి దేనికైనా అడిక్ట్ అయితే మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము మరియు అటువంటి అడిక్షన్ వలన అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది.
వీటి అన్నిటికీ శాస్త్రీయ వైద్యం చేయించడం వల్లన ఆ వ్యక్తి మాని కుటుంబ పురోగతికి ఉపయోగపడతారు . దీనికి కుటుంబసబ్యుల, వైద్య బృందం మరియు మందుల సహకరం చాలా అవసరము
ఆల్కహాల్ అడిక్షన్
మద్య పానము మరియు ఇతర మత్తు పదార్దాల వ్యసనముల వల్ల ప్రభావం శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన, కుటుంబ సంబంధాలు తగ్గడము, పనిదినములు తగ్గి ఆర్ధికంగా కుటుంబము పైన బారము, ఆసుపత్రుల ఖర్చు, సాంఘికంగా విలువ తగ్గడము, పిల్లల మానసిక ఎదగుదల మీద ప్రభావము మొదలగు సమస్యలు తలెత్తుతాయి.
ఈ వ్యసనం ను మొదటి దశలో గుర్తించి వైద్యము తీసుకుంటె మంచి ఫలితాలు ఉండును. కొన్ని సార్లు మందుకు అలవాటు పడిన వారిని తిట్టడం వల్లన, విమర్శించడం వలన, చెప్పకుండా మందులు ఆహారపదార్థాలు లో కలిపి ఇవ్వడం వలన వారు వైద్యము చేయించుకోవడానికి ఇష్టపడరు.
ఇలాంటి సమయాలలో కుటుంబసభ్యుల సహకారము చాలా అవసరం. మద్యపాన వ్యసనం అనేది ఒక దీర్ఘకాలిక అరోగ్య మరియు సాంఘిక సమస్య అని కుటుంబ సభ్యులు గుర్తించాలి.
వ్యసనము నుంచి బయటకు రావడానికి మందులతో పాటుగా, కుటుంబం, మిత్రులు, ఆసుపత్రి మొదలగు అందరి సహకారం అవసరం. మా వద్ద వీటిని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వైద్యము చేయబడును. పూర్తి వివరాల కోసము మమ్మల్నిసంప్రదించండి.