ప్రస్తుత సమాజములో రోజువారీ సమస్యలు కాకుండా ఒక్కసారిగా మనకు కావలసిన వారు చనిపోవడం, పెద్ద ఆర్దిక సమస్యలు, జాబ్ పోవడం, పరీక్షలలో ర్యాంక్ రాకపోవడం, పెద్ద ఆరోగ్యసమస్యలు రావడం చూస్తుంటాం ఇలాంటి సందర్భములో చాలా ఒత్తిడికి లోనై చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సందర్భములో కొన్నిసార్లు బయటకు రాలేక ఇబ్బంది ఉంటుంది, దీనికి అవసరమయిన సహాయం చేస్తే బయటకు త్వరగారాగలరు