మానసిక ఆరోగ్యం అనగానే చాలామంది మాకు లేవు మాకు రావు అని ఎదుటివారు మాట్లాడేది కూడా వినకుండా పక్కకు నెట్టివేస్తారు ఇది సహజముగా మనము చూస్తుంటాము. కాని మనస్సు(మెదడు ) కూడా మన శరీరములో ఒక బాగం కావున ఇది కూడా శరీరములో ఇతర భాగముల వలె వ్యాధులకు గురి అవును.
మనో వ్యాధికి మందు లేదు, మందులు వాడితే అలవాటు పడిపోతారు, ఇది గాలి మరియు దయ్యం పట్టింది అని తాయత్తులు, ఆంత్రాలు కట్టించడం మరియు భూత వైద్యo చేయించుకోవడం మనము తరచుగా వింటుంటాము ఇలాంటి పనులతో విలువైన సమయము, డబ్బు వృధా కావడమే కాకుండా వ్యాధి జటిలం అవుతుంది.
మెదడు చేసే ముఖ్య పనులు— బాగోద్వేగములను అదుపులోఉంచడం, నిర్ణయాలను సరిగ్గా తీసుకోవడం, స్తిమితమైన ఆలోచనలు, మాటలు పరిస్తితులకు అనుగుణముగా మాట్లాడటం, దానికి అనుగుణముగా ప్రవర్తన ఉండటం. మానసిక సమస్యలు ఉన్నప్పుడు వ్యక్తి ఈ విషయాలలో నియంత్రణ తగ్గి అతని ప్రవర్తన మారుతుంది దానివల్లన ఆ వ్యక్తి రోజువారీ పనిలో ఇబ్బందిపడును
2.మానసిక వ్యాధులకు వాడు మందుల గురించిన ముఖ్య విషయములు
చాలా వరకు మానసిక వ్యాధులకు వాడు మందులతో మార్పు 2 నుంచి 3 వారాములు పట్టును అప్పటివరకు ఓపిక మీకు చాలా అవసరము
మానసిక వ్యాధులకు వాడు మందులు ఇతర శారీరక సమస్యలకు వాడు మందుల వలె వ్యాధిని తగ్గించును, కాని చాలా మంది వీటికి ఎక్కువ సైడ్ ఎఫక్ట్స్ ఉండును అని బావించి వాడకుండా సమస్యను జటిలం చేసుకుంటారు
సైడ్ ఎఫక్ట్స్ చాలా వరకు ఒకటి నుంచి రెండు వారములలో తగ్గిపోయి వ్యాధి లక్షణములలో మార్పు స్పష్టముగా కనపడును
మానసిక సమస్యలు కొంతమంది లో బీపీ, షుగర్ లాగా దీర్ఘకాలికముగ ఒకటి లేక రెండు రకముల మందులు వాడతారు, కాని దీనిని కొంతమంది మందులకు అలవాటు పడతారు అనుకొంటారు ఇది అపోహా మాత్రమే
అలవాటు పడే మందులు లేదా ఏదయినా తీవ్రమయిన సైడ్ ఎఫక్ట్స్ మందుల వల్ల ఉంటే డాక్టర్ గారు మీకు ఖచ్చితముగా వివరించి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుదురు
3.మానసిక సమస్యలతో బాధపడు వ్యక్తికి ఇవ్వవలసిన సపోర్ట్
మానసిక సమస్యలు కూడా శారీరక సమస్యల వలె వచ్చు సమస్యలు అని ముందుగా అర్దం చేసుకొని ఆ వ్యక్తి తో సున్నితముగా మాట్లాడవలెను
నీకు నేను ఉన్నాను అని చెప్పడం, తను చేసుకొనే రోజువారీ పనుల్లో సహాయం చేయడం
నీ ఆలోచనలు మార్చుకో అదే తగ్గుతుంది అని చెప్పడం లేదా నువ్వు కావాలని చేస్తునావు లాంటి మాటలు అనరాదు
వీలైనంత వరకు ఆ వ్యక్తికి చేరువలో ఉండడం
ఆ వ్యక్తికి ఇష్టంగా లేని విషయం గురించి చెప్పమని బలవంతం చేయడం మరియు ఇష్టం లేని సలహాలు ఇవ్వడం చేయకూడదు
నువ్వు ఉన్న పరిస్థితి నాకు బాగా అర్థమవుతుంది లాంటి మాటలు చెప్తూ ఆ వ్యక్తి మాట్లాడే విధముగా ప్రోత్యహించాలి
ఆ వ్యక్తి మాట్లాడే సమయములో చాల ఓపికగా వినడం చేయాలి, ఆ సమయంలో సలహాలు ఇవ్వడం చేయరాదు
ఈ సమస్యలు మెదడులో సమస్య ఉండడం వల్లన వస్తాయి కనుక డాక్టర్ని కలవడం మంచిది అని ప్రోత్యహించడం చేయవలెను
మానసిక వైద్యులను కలవడానికి అవసరమైన సహాయం చేయవలెను
4.బలవన్మరణం నివారించడం
బలవన్మరణం నివారించడం మన అందరి సామాజిక కర్తవ్యం. మనకు తెలిసిన వారు ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి అన్నపుడు, వాళ్ళకి బరోసా గా ఉండడం అంటే వారికి అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని అడగడం, వారు మాట్లాడటాన్ని ప్రోత్యహించడం, ఓపికగా వినడం, ముఖ్యంగా ఏ సలహాలు చెప్పకుండా వినడం చేయడం, మానసిక వైద్య నిపుణుల ను కలవడానికి ప్రోత్యాహించడం లాంటివి చేయవలెను……