సాధారణముగా మద్య వయస్సులో వచ్చు మానసిక వ్యాధులగు డిప్రెషన్ లేదా కృంగుబాటు–
రోజులో ఎక్కువ సమయం బాధగా ఉంటు ఏడుపు రావడం,
బాగా నీరసం గా ఉండి రోజువారి పని చేయాలని లేకపోవడం,
రోజువారి పని మీద ఆసక్తి బాగా తగ్గిపోవడం,
పనులలో ఏకాగ్రత తగ్గడం
కలత నిద్ర మరియు ఆకలి తగ్గిపోయి బరువు తగ్గడం
సెక్స్ మీద ఆసక్తి తగ్గడం,
తనమీద తనకు ఆత్మ విశ్వాసం కోల్పోవడం,
నిరాశతో చనిపోవాలని అనిపించడం వంటి లక్షణాలు 2 వారాలు మించి ఉండటం
ఆందోళన వ్యాధి(anxiety disorder)
ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బయపడటం
అతి భయం- ఉదాహరణకు ఏదైనా తీవ్రమైన శారీరక అరోగ్య సమస్యలు వస్తాయని భయం
అకస్మాత్తుగా విపరీతమైన గుండె దడ తో చెమటలు పట్టడం, కాళ్ళు చేతులు వణకడం, శ్వాస ఇబ్బందిగా ఉండడం, తల తిప్పడం, గ్యాస్ గా ఉండడం మొదలైన లక్షణాలు
వాంతి వచ్చినట్లు ఉండి ఆకలి లేకపోవడం
ఈ లక్షణాలు అన్ని సమయాలలో కంటే ఆలోచించడం వల్లన, చెడు వార్తలు విన్నపుడు బాగా ఎక్కువగా ఉంటాయి
మేనియా (బైపోలార్ డిజార్డర్)
ఈ రుగ్మత తో బాధపడే వ్యక్తి అత్యుత్సాహంగా మరియు తన మీద తాను చాలా అతివిశ్వాసముగా కనిపిస్తాడు- వాస్తవమును గ్రహించలేడు.
ఎక్కువగా చిరాకు మరియు వారి మూడ్ క్షణ క్షణముకు మారిపోవడం, ప్రవర్తనలో స్తిమితం లేకుండుట
ఖాళీగా ఉండకుండా చాలా పనులను మొదలుపెట్టి వదిలేస్తుంటారు.
వేగంగా మరియు ఒత్తిడి తో బడాయిగా మాట్లాడటం మరియు ఇతరులకు అడ్డుపడటం
పని మీద ఏకాగ్రత బాగా తగ్గడం
నిద్ర తగ్గిపోవడం ఆయన సరే అలసట లేకపోవడము
డబ్బు విపరీతముగా ఖర్చుపెట్టడం
సిగ్గు మరియు బిడియం లేకుండా మాట్లాడటం లేదా ప్రవర్తించడం
అబ్సెసివ్ కపల్సివ్ డిజార్డర్ (OCD)
ఏదైనా ముట్టుకున్నా అక్కడ మురికి ఉంది అన్న అనుమానంతో మళ్ళీ మళ్ళీ చేతులు కడుక్కోవడం.
బాత్రూమ్ లో గంటలు గంటలు ఉండడం
బైక్ తాళము వేసిన, గ్యాస్ అపినా కూడా, తలుపు గొళ్ళెం పెట్టిన తరువాత కూడా పెట్టలేదు అనే ఆలోచనతో పదే పది చెక్ చేయడం.
ఇంటిని ఒక క్రమపద్ధతిలో లేదా స్థిరమైన పద్ధతిలోనే సర్దడం
బాగా కావలసిన లేదా దేవుడు మీద ఎవరికి చెప్పుకోలేని (సెక్స్ లాంటి) ఆలోచనలు పదె పదె రావడం
అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం
Health anxiety disorder (శరీర ఆరోగ్యం గురించి ఆందోళన)
కడుపు ఉబ్బరం, గ్యాస్, ఒళ్లు నొప్పులు, గుండె దడ, తల తిరగడం, ఛాతి నొప్పి, తిమ్మిరిగా ఉండడం మొదలగు సామాన్యముగా వచ్చే లక్షణాలను, వాటిని గుండె జబ్బు, క్యాన్సర్, పక్షవాతం, ఎయిడ్స్ మొదలగు తీవ్రమైన జబ్బుల లాగా భావించడం
డాక్టర్స్ అన్ని పరీక్షలు, స్కానింగ్ లు చేసి వారు ఇచ్చిన మందులు చాలా కాలం వాడినా తగ్గక పోవడం
వారు చెప్పింది అంగీకరించకుండా ఇంకా డాక్టర్స్ ని మార్చడం.
వీరు బాధపడుతూ కుటుంబసభ్యులకు కూడా బాధ కలిగించడం చేస్తూ, ఆర్దికంగా మరియు వ్యక్తిగతంగా నష్టం కలుగుతూ ఉంటుంది.
స్కిజోఫ్రీనియా (schizophrenia)
చెవిలో ఎవరికి వినబడని శబ్దాలను వారు మాత్రమే వినడం
తనలో తానే మాట్లాడుకోవడం, నవ్వుకుంటూ ఉండడం
ఇతరులు తన మీద కుట్రపన్నుతున్నారని మరియు తన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుమానము
తన మైండ్ ని బయట వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారు అని నమ్మడం
వ్యక్తిగత శుభ్రత తగ్గిపోవడం మరియు పని చేయడానికి ఆసక్తి చూపకపోవడం
నలుగురు తో కలవకుండా ఒంటరిగా ఉండడం
పిలిచిన ఏదో ఆలోచన చేస్తున్నట్లు పరధ్యానం లో ఉండడం.
మాకు ఏ విధమైన సమస్య లేదు అని ట్రీట్మెంట్ కి సహకరించక పోవడం.