
- మనస్సు(మెదడు ) కూడా మన శరీరములో ఒక బాగం కావున ఇది కూడా శరీరములో ఇతర భాగముల వలె వ్యాధులకు గురి అవును
- వ్యక్తి యొక్క స్వబావము, జీవితములో వచ్చు సాంఘిక సమస్యలు మానసిక వ్యాధులు రావడానికి ఒక ట్రిగర్ లాంటిది–మనకు సమస్యలు లేవు కాబట్టి మనకు మానసిక సమస్యలు రావు అనకోవడం అపోహ
- చాలా మంది మేము ఏమి ఆలోచించడం లేదు మాకు ఎటువంటి కుటుంబ సమస్యలు లేవు కావున మాకు ఎందుకు మానసిక సమస్యలు వస్తాయి అని అనుకుంటారు, ఈ సమస్యలు ఎవరికైనా వస్తాయి ఇది వాస్తవం
- మనో వ్యాధికి మందు లేదు, మందులు వాడితే అలవాటు పడిపోతారు, ఇది గాలి మరియు దయ్యం పట్టింది అని తాయత్తులు, ఆంత్రాలు కట్టించడం మరియు భూత వైద్యo చేయించుకోవడం వంటి అపోహలతో విలువైన సమయము, డబ్బు వృధా కావడమే కాకుండా వ్యాధి జటిలం అవుతుంది
- మానసిక సమస్యలతో బాధపడే వారితో నీ ఆలోచనలు మార్చుకో అదె తగ్గిపోతుంది లాంటి మాటలు అనకుండా ఆ వ్యక్తికి బరోసా ఇచ్చేవిధముగా మాట్లాడవలేను.
- కొంతమంది మానసిక సమస్యలకు వాడే మందులను నిద్ర మాత్రలుగా భావించి కొంతకాలం వాడి డాక్టర్ సలహా లేకుండా ఆపివేయడం ఆపివేయడం తరచుగా చూస్తున్నాము ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగి తిరిగి మళ్ళీ వచ్చే ఆస్కారము ఎక్కువగా ఉంటుంది
- మానసిక సమస్యలు కొంతమంది లో బీపీ, షుగర్ లాగా దీర్ఘకాలిక వ్యాధి లాగా ఉండవచ్చును, వీరికి ఒకటి లేక రెండు రకముల మందులతో చక్కగా వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చును— దీనిని కొంతమంది మందులకు అలవాటు పడుతున్నాం అనుకుంటారు ఇది అపోహా మాత్రమే
- మానసిక సమస్యలు కొన్నిసార్లు మందులు వాడుతున్న కూడా సమస్య లక్షణములలో మార్పు ఉండవచ్చును కావున మందులను రెగ్యులర్ గా డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడడం చాలా అవసరం దీని వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి
- మందులు రెగ్యులర్ గా వాడడం అంటే డాక్టర్స్ రాసిన డోస్ ని వారు ఇచ్చిన రోజుల పాటు వాడుకొని తిరిగి హాస్పిటల్ రావడం ఇలా చేయడం వల్ల డాక్టర్స్ కు మీ సమస్యకు వైద్యం చేయడం తేలికగా ఉంటుంది
- మందులు వాడుతున్న సమయములో ఏదయినా ఇబ్బంది ఉంటే వెంటనే వ్యక్తిగతముగా లేక ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవాలి, అంతే గాని ఎవరో చెప్పారని వారి సలహాలు పాటించి మందులు మరియు ట్రీట్మెంట్ ఆపరాదు ఎందుకంటే వారికి మానసిక సమస్యల పట్ల శాస్త్రీయ అవగాహన ఏమాత్రము ఉండదు
- మీ సందేహాలను రెగ్యులర్ గా కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు డాక్టర్ గారు తీర్చేదరు, ఇది మీకు చాలా ఉపయోగకరం
మంచి మానసిక ఆరోగ్యము — సమాజ శ్రేయస్సు మానసిక వైద్యులను కలవడానికి సంకోచించకండి
ఇతర వివరముల కొరకు డా. జి. జగదీష్ కుమార్ యం.డి., మానసిక వైద్య నిపుణులు మన తేజ పాలి క్లినిక్, బోస్ బొమ్మ సెంటర్, ఓల్డ్ క్లబ్ రోడ్ నందు అందుబాటులో ఉండును
ఆపాయింట్మెంట్ కొరకు: 9493234704

